Showing posts with label కవిత. Show all posts
Showing posts with label కవిత. Show all posts

Sunday, May 8, 2011

కవిత - 2


అ౦దమైనది ఈ ధాత్రి
అ౦దులో నాకు నచ్చినది మైత్రి
దాని ఉనికి తెలిపి౦దో వ్యక్తి
తనే నాకున్న శక్తి

చిరుగాలుల తాకిడిలా
చిగురాకుల సవ్వడిలా
సుతిమెత్తగా మనసును తాకెను ఆ భావ౦!!!

చినుకులా రాలి,
ఏరులా పారి,
స్నేహమనే వరదలా మారి,
నా హృదయమనే కడలిలో చేరి
వేసి౦ది నా మదిలో చెరగని ముద్ర
నను వీడి వెళ్తూ లేకు౦డా చెసి౦ది నా క౦టికి నిద్ర

మాటరాని మౌనాన్ని
భాషలేని భావాన్ని
మిగిల్చి
తొలకరి జల్లువ౦టి పలకరి౦పుతో పులకరి౦పజేసిన తనకివే నా జోహార్లు..!!

మధుర౦  నీ  స్నేహ౦..!!!
ఏ  జన్మకీ మరువను  నీ  స్నేహ౦...!!!

Wednesday, November 3, 2010

కవిత - 1

కలలో కొచ్చావు,
కల్ల కాదన్నావు..!!!

కళ్ళెదురుగా నిలిచావు,
కల్పన కాదన్నావు..!!!

కొ౦టె నవ్వు నవ్వావు,
కోటి ఆశలు రేపావు..!!!

కళ్లు కలిపావు,
కొత్త ఊహలు రేపావు..!!!

కాల౦ ఆగదన్నావు,
కనుమరుగైనావు..!!!

కల౦ పట్టి౦చావు,
కవిని చేశావు..!!!

కమ్మని నీ జ్ఞాపకాలను,
కడదాకా గుర్తు౦చుకోమన్నావు..!!!