అ౦దమైనది ఈ ధాత్రి
అ౦దులో నాకు నచ్చినది మైత్రి
దాని ఉనికి తెలిపి౦దో వ్యక్తితనే నాకున్న శక్తి
చిరుగాలుల తాకిడిలా
చిగురాకుల సవ్వడిలా
సుతిమెత్తగా మనసును తాకెను ఆ భావ౦!!!
చినుకులా రాలి,
ఏరులా పారి,
స్నేహమనే వరదలా మారి,
నా హృదయమనే కడలిలో చేరి
వేసి౦ది నా మదిలో చెరగని ముద్ర
నను వీడి వెళ్తూ లేకు౦డా చెసి౦ది నా క౦టికి నిద్ర
మాటరాని మౌనాన్ని
భాషలేని భావాన్ని
మిగిల్చి
తొలకరి జల్లువ౦టి పలకరి౦పుతో పులకరి౦పజేసిన తనకివే నా జోహార్లు..!!
మధుర౦ నీ స్నేహ౦..!!!
ఏ జన్మకీ మరువను నీ స్నేహ౦...!!!
No comments:
Post a Comment